
వైటీపీఎస్ చీఫ్ ఇంజనీర్‌గా రమేష్‌బాబు
మిర్యాలగూడ : దామరచర్ల మండలంలోని వీర్లపాలెంలో గల యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ (వైటీపీఎస్) చీఫ్ ఇంజనీర్‌గా వి.రమేష్‌బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీఆర్‌వీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జెన్‌కో కార్యదర్శి చారుగుండ్ల రమేష్ ఆధ్వర్యంలో పలువురు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ రమేష్‌బాబు మాట్లాడుతూ వైటీపీఎస్‌లో నీటి సదుపాయం కల్పిస్తామని, వీరప్పగూడెం నుంచి వీర్లపాలెం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని, కార్మికులకు సరిపడా మందులను అందుబాటులో ఉంచుతామని, రెండవ అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రామ్మోహన్‌రావు, శ్రీనివాస్‌రావు, విజయేందర్‌రావు తదితరులు ఉన్నారు.
మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు
నకిరేకల్ : నర్సరీలో మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఓ వై.శేఖర్‌రెడ్డి కోరారు. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామలోని గ్రామపంచాయతీ నర్సరీని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నర్సరీ నిర్వహణ, వన మహోత్సవ యాక్షన్ ప్లాన్ వివరాలను తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీఓ చంద్రశేఖర్, ఏపీఓ రమణయ్య తదితరులు ఉన్నారు.
రెండో దశ మిషన్ ఇంద్రధనస్సు ప్రారంభం
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం రెండో దశ మిషన్ ఇంధ్రదనస్సు కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం మే 21 నుంచి 28వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశ వర్కర్ల ద్వారా గర్భిణులకు, పదేళ్లలోపు వయస్సున్న పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి కల్యాణ్ చక్రవర్తి, కేశ రవి, ప్రోగ్రాం అధికారులు ఎస్.పద్మ, కృష్ణకుమారి, డీపీఓ విష్ణు, డీవీఎల్‌ఎం జి.రాము, ఉదయ్, వైద్యాధికారి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్‌లో రాణించాలి
నల్లగొండ టూటౌన్ : క్రీడాకారులు క్రికెట్‌లో రాణించాలని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సయ్యద్ అమీనొద్దీన్ కోరారు. నల్లగొండ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఔట్‌డోర్ స్టేడియంలో ఇంట్రా ఉమ్మడి జిల్లా లీగ్ మ్యాచ్ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులు లీగ్ మ్యాచ్ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీని ఆధారంగానే త్వరలో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్ జిల్లా టోర్నమెంట్‌కు ఎంపిక చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సయ్యద్ సఫియొద్దీన్, సతీష్, విశ్వనాథ్, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

వైటీపీఎస్ చీఫ్ ఇంజనీర్‌గా రమేష్‌బాబు

వైటీపీఎస్ చీఫ్ ఇంజనీర్‌గా రమేష్‌బాబు

వైటీపీఎస్ చీఫ్ ఇంజనీర్‌గా రమేష్‌బాబు