
కేశవరావు ఎన్‌కౌంటర్‌పై నిరసన
నల్లగొండ : సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావుది బూటకపు ఎన్‌కౌంటర్ అని, దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయాలని కోరుతూ గురువారం నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ శాంతి చర్చలు జరుపకుండా కేంద్ర ప్రభుత్వం పోలీస్ బలగాలతో ఏకపక్షంగా కాల్పులు జరిపి కేశవరావును హత్య చేయడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో ఇందూరి సాగర్, పందుల సైదులు, జ్వాల వెంకటేశ్వర్లు, గూడూరు జానకిరామ్‌రెడ్డి, కోమటిరెడ్డి అనంతరెడ్డి, గద్దపాటి సురేందర్, గోలి సైదులు, అయితగోని జనార్దన్‌గౌడ్, దుర్గయ్య, బీవీచారి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

కేశవరావు ఎన్‌కౌంటర్‌పై నిరసన