రైలులో ప్రయాణిస్తూ గుర్తుతెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలులో ప్రయాణిస్తూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

Nov 16 2023 6:06 AM | Updated on Nov 16 2023 6:06 AM

గుర్తుతెలియని వ్యక్తి
మృతదేహం  - Sakshi

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

మిర్యాలగూడ అర్బన్‌: రేపల్లె ట్రైన్‌లో గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. మిర్యాలగూడ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపల్లె ట్రైన్‌లో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడనే సమాచారంతో ట్రైన్‌ మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న అనంతరం స్టేషన్‌ మేనేజర్‌ జనరల్‌ బోగిలోని సదరు వ్యక్తిని కిందకు దింపి 108వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అతడు అప్పటికే మృతి చెందాడని 108సిబ్బంది నిర్ధారించడంతో మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపర్చినట్లు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, మృతుడు 35 నుంచి 40ఏళ్ల మధ్య వయసు ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు మిర్యాలగూడ రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement