
అభిలాష్ (ఫైల్)
మర్రిగూడ : పురుగుల మందు తాగి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మర్రిగూడ మండల పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి చెందిన దామెర అభిలాష్(35) కొంతకాలంగా కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నల్లగొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున అభిలాష్ మృతిచెందాడు. అభిలాష్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గాయపడిన
రిటైర్డ్ టీచర్ మృతి
నకిరేకల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విశ్రాంత ఉపాధ్యాయుడు మృతిచెందాడు. నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన వద్ది లక్ష్మీనారయణ(65) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి విరమణ పొందారు. లక్ష్మీనారాయణ నాలుగు నెలల క్రితం బైక్‌పై నకిరేకల్ నుంచి చందుపట్ల గ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో చీమలగడ్డ ఫ్లై ఓవర్ కింద ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి కుమారుడు సుమన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సుధీర్ తెలిపారు.