ఇందిరమ్మకు ని‘బంధనాలు’ | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మకు ని‘బంధనాలు’

Oct 12 2026 8:10 AM | Updated on Oct 12 2026 8:10 AM

సగటున 10 వేల వాహనాలు.. ప్రధాన కారణాలు ఇవే.. అవగాహన కల్పిస్తున్నాం..

ఇంటి పైకప్పు విస్తీర్ణం 750 చదరపు అడుగులు మించొద్దు

జీఓ 352 ప్రకారం..

ఉమామహేశ్వర ఆలయ ఈఓ బదిలీ

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

అచ్చంపేట రూరల్‌: పట్టణంలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతు కారణంగా సోమవారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాసులు తెలిపారు. సబ్‌స్టేషన్‌ పరిధిలోని వివిధ మండలాలు, గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని, ఈ అంతరాయానికి వినియోగదారులు, రైతులు సహకరించాలని ఆయన కోరారు.

17న మహాధర్నా

జడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 17న కల్వకుర్తి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పాలమూరుకు దక్కాల్సిన నీటిని నల్లగొండ జిల్లాకు తరలించే ప్రయత్నాలను ఆపాలని డిమాండ్‌ చేశారు. దీనివల్ల జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సాగునీటి వనరుల కల్పనలో విఫలమయ్యాయని, శాశ్వత ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల నుంచి రైతులు, నిర్వాసితులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.

ఆక్టోపస్‌ సమీపంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు (ఫైల్‌)

హైదరాబాద్‌– శ్రీశైలం– తోకలపల్లి జాతీయ రహదారి–765 రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైంది. దక్షిణకాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలానికి హైదరాబాద్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ జిల్లాల నుంచి పెరిగిన వాహనాల రద్దీకి అనుగుణంగా రెండు వరుసల రహదారిపై ప్రయాణం చేయడం ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం ప్రతిరోజు సగటున 10 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. శని, ఆది, సోమవారాల్లో ఈ సంఖ్య 12 వేలకు చేరుతుంది. 2027 నాటికి 15 వేలు, 2040 నాటికి 30 వేలకు చేరుతుందని ట్రాఫిక్‌ అధ్యయనంలో తేలింది. ఈ రహదారి నల్లమల అటవీ ప్రాంతం గుండా సాగుతుండగా.. సుమారు 56 కి.మీ., మార్గం అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ప్రాంతంలో ఉండటంతో పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల సంచారం ఉంటుంది. కాబట్టి ఈ రోడ్డు విస్తరణకు గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే మూడేళ్లుగా అటవీ మార్గంలో బ్రాహ్మణపల్లి (మన్ననూర్‌)– పాతాళగంగా వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం ప్రతిపాదనలు నడుస్తున్నాయి. దీంతోపాటు ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌–13 నుంచి రావిర్యాల, మీర్‌ఖాన్‌పేట్‌ మీదుగా ఆకుతోటపల్లి వరకు నడుస్తున్న రతన్‌టాటా గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే కొనసాగింపుగా బ్రాహ్మణపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం చేసింది.

మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఉన్న రెండు వరుసల జాతీయ రహదారి ఇరుకుగా ఉండటం, విస్తరణకు నోచుకోకపోవడంతో వాహనాలు అతివేగంతో ప్రయాణించడం వల్ల ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నియంత్రించడంలో జాతీయ రహదారులు, పోలీసు, అటవీశాఖ అధికారులు విఫలమవుతున్నారు. నల్లమల ఘాట్‌ రోడ్డు తీవ్రమైన మలుపులతో ఉండటంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సరైన అవగాహన లేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అమ్రాబాద్‌ అభయారణ్య ప్రాంతంలో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల ప్రవేశం నిషిద్ధం. అయితే కొందరు ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రాత్రి 9 గంటలలోపే చెక్‌పోస్టు దాటి.. అటవీ ప్రాంతంలో వాహనాలు ఆపి మద్యం తాగి అర్ధరాత్రి ప్రయాణాలు సాగిస్తుండటం ప్రమాదాలకు దారితీస్తోంది. నల్లమలలో ఇటీవల చోటుచేసుకున్న చాలా ప్రమాదాలు ఈ కోవలోకే వస్తాయి. రోడ్డుపై స్పీడు బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా వాహనదారులు వీటిని పట్టించుకోవడం లేదు. రాత్రి సమయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నిబంధనలు అతిక్రమిస్తున్నారు. అలాగే ఈ మార్గంలో రాకపోకలు అధికంగా ఉండటం వల్ల నాలుగు వరుసల రహదారి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ క్రీడాపోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌ అన్నారు. సంగారెడ్డిలో ఆదివారం నుంచి ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 కబడ్డీ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్లు తరలివెళ్లాయి. కబడ్డీ జట్లను స్థానిక మెయిన్‌ స్టేడియంలో వేణుగోపాల్‌ అభినందించారు. సమష్టిగా ఆడితే విజయం సాధించవచ్చని అన్నారు. అదే విధంగా సిద్దిపేటలో ఆదివారం నుంచి జరుగుతున్న స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–14, 17 బాల, బాలికల రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు బయలుదేరారు. క్రీడాకారులను జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి అభినందించారు. రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇల్లు నిర్మించాలని జిల్లాలో 616 మంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశాం. స్లాబ్‌ సైజు ఎక్కువ వేయడం వల్ల లబ్ధిదారులపై అదనపు భారం పడి అప్పుల పాలు అవుతున్నారని ప్రభుత్వం పరిమితి విధించి ఇళ్ల నిర్మాణం చేపట్టుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా నిబంధనలు అమలు చేయకపోతే బిల్లుల చెల్లింపు నిలిచిపోతుంది. ఈ మేరకు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం.

– గోపాల్‌నాయక్‌, ఇన్‌చార్జి హౌసింగ్‌ పీడీ

కల్వకుర్తి రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు గృహ నిర్మాణ శాఖ షాక్‌ ఇచ్చింది. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సహాయం సద్వినియోగం కావాలనే సంకల్పంతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అనుమతించిన స్లాబ్‌కు నుంచి విస్తీర్ణం పెంచే వారిపై నియంత్రణ చర్యలు చేపట్టింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి స్లాబ్‌ సైజు విస్తరిస్తే ప్రభుత్వం నుంచి ఇచ్చే సాయం నిలిచిపోతుందని హెచ్చరించారు. కొత్త నిబంధనలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు వర్తిస్తాయని ప్రభుత్వం ఆదేశాలలో పేర్కొంది. ఇప్పటికే జిల్లాలో నోటీసుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో చాలామంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గోడల కంటే 3 నుంచి 8 అడుగుల వరకు స్లాబును ముందుకు పొడిగించినట్లు అధికారులు గుర్తించారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి అందే రూ.5 లక్షల ఆర్థిక సహాయం సరిపోక పేదలు అప్పుల బారిన పడుతున్నారని, మరికొందరు ఈ భారం తట్టుకోలేక ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అందించే సహాయంతోనే ఇంటి నిర్మాణం పూర్తి కావాలనే ఉద్దేశంతో స్లాబ్‌ వైశాల్యంపై పరిమితులు విధించారు. ఈ నేపథ్యంలో ఇంటి స్లాబ్‌ 750 చదరపు అడుగులు దాటితే చెల్లింపులు నిలిపివేస్తామంటూ గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులకు నోటీసులు పంపిణీ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు.

నత్తనడకన నిర్మాణాలు..

జిల్లాలోని 20 మండలాల్లో మొదటి విడతలో 9,814, రెండో విడతలో 850 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఇప్పటికే 2,600 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. ఇప్పటి వరకు 1,700 ఇళ్లు ప్రారంభానికే నోచుకోలేదు. బేస్మెంట్‌ లెవెల్‌లో 1,506 ఇళ్లు ఉండగా.. రెంటల్‌ లెవెల్‌లో 616 ఇళ్లు, 3,300 ఇళ్లకు మార్కౌట్‌ ఇవ్వగా.. మిగతావి వివిధ దశలో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడంతో అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు మరింత పెంచారు. ఆయా మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్‌ ఏఈలు, డీఈలు గ్రామాల్లో పర్యటిస్తూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

అచ్చంపేట రూరల్‌: శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర ఆలయ ఈఓగా ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఈఓ నర్సింహులు బదిలీపై వచ్చారు. ఈ మేరకు ఇక్కడి ఈఓ శ్రీనివాసరావు మామిళ్లపల్లి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి బదిలీపై వెళ్లారు. వివిధ శాఖల్లో జరుగుతున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో భాగంగానే దేవాదాయ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

వైశాల్యం పెరిగితే బిల్లుల

నిలిపివేతకు ఆదేశాలు

లబ్ధిదారులు అప్పుల పాలు

కావొద్దనే ఉద్దేశంతో చర్యలు

తాజాగా కొత్త మార్గదర్శకాలు

జారీ చేసిన ప్రభుత్వం

జిల్లాలో ఇప్పటికే

616 మందికి నోటీసులు

ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నం.352 ప్రకారం 400 చదరపు అడుగుల ప్లింత్‌ ఏరియా కలిగిన ఇంటికి స్లాబ్‌ వైశాల్యం గరిష్టంగా 500 ఫీట్లలోపే ఉండాలి. 600 స్క్వేర్‌ ఫీట్‌ ప్లింత్‌ ఏరియా కలిగిన ఇంటికి స్లాబ్‌ గరిష్టంగా 750 స్క్వేర్‌ ఫీట్ల వరకే ఉండాలి. ఇంటి ముందు వైపు స్లాబ్‌ పొడిగింపును గరిష్టంగా మూడు అడుగులకు పరిమితం చేసి మిగిలిన మూడు వైపులా ఒక్క అడుగు మాత్రమే పొడిగించాలని ఆదేశాలలో స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఈ నెల ఒకటి నుంచి అమలులోకి వచ్చాయి. స్లాబ్‌ నిర్మాణంలో సైజు పెంచితే బిల్లు చెల్లింపులు నిలిపివేస్తామని నోటీసులో హెచ్చరించారు. ఇప్పటికే ఎక్కువ విస్తీర్ణంలో స్లాబ్‌ వేసిన వారు హౌసింగ్‌ అధికారులను సంప్రదించాలని, నిబంధనలు పాటించకుండా ఆర్థికంగా నష్టపోతే లబ్ధిదారులే బాధ్యత వహించాలని హౌసింగ్‌ శాఖ పేర్కొంది. మార్గదర్శకాలకు విరుద్ధంగా అదనపు నిర్మాణం చేపట్టి నష్టపోకుండా జాగ్రత్త వహించాలని లబ్ధిదారులకు జారీ చేసిన నోటీసులలో ప్రభుత్వం సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement