కబోదిలా ఎకై ్సజ్ శాఖ నటన
–8లో u
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆబ్కారీ శాఖ అధికారుల వైఖరి చర్చనీయాంశంగా మారింది. ఆల్ఫ్రాజోలం వంటి ప్రమాదకర మత్తు పదార్థాల రవాణా, తయారీపై నిఘా కట్టుదిట్టం చేశామని గొప్పలు చెప్పుకొంటున్న వారు.. తమ కళ్ల ముందే జరుగుతున్న కల్తీ కల్లు విక్రయాలను మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈత, తాటి చెట్ల ఆనవాళ్లే లేకుండా మందుకల్లు పారిస్తున్న మాఫియాకు ముకుతాడు వేయాల్సింది పోయి.. కేవలం మూలాలు తొలగిస్తున్నామంటూ చేతులు దులుపుకొంటున్నారు. నెలనెలా అందుతున్న మామూళ్ల మత్తుతో ఈ దందాకు అడ్డుకట్ట వేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న కృత్రిమ కల్లు విక్రయాలు.. నాశనమవుతున్న పేద కూలీలు, కార్మికుల బతుకులపై ‘సాక్షి’ కథనం..
అనధికారిక దుకాణాలు.. కృత్రిమ కల్లు
నిబంధనల ప్రకారం తాటి, ఈత, ఖర్జూర వనాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన కల్లు విక్రయించాలి. కానీ ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలో 75 శాతం వరకు మందు కల్లు విక్రయాలే జరుగుతున్నాయి. అంతేకాదు అన్ని జిల్లాల్లోనూ అధికారికంగా లైసెన్స్ కలిగిన కల్లు దుకాణాలకు మించి 50 శాతం మేర అనధికారికంగా నడుస్తున్నాయి.
● గద్వాల పట్టణ పరిధిలో ఒక డిపో ఉంది. దీని పరిధిలో అధికారికంగా ఎనిమిది దుకాణాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం సదరు డిపోలో తయారు చేసిన కల్లును ఆయా షాపులకు మాత్రమే సరఫరా చేయాలి. ప్రస్తుతం ఆ డిపో అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. కల్లు తయారీ నిలిచిపోయింది. కానీ అనధికారికంగా దాని పరిధితో పాటు చుట్టుపక్కల మండలాల్లోని సుమారు 17 గ్రామాల్లో దుకాణాలు ఏర్పాటు చేసి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆమ్యామ్యాలతో ఎర..
ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన కల్లు డిపోల నిర్వాహకులు తమ అక్రమ వ్యాపారానికి అడ్డుతగలకుండా ఆమ్యామ్యాలు ఎర వేస్తున్నారు. డిపోకు సమకూరిన ఆదాయంలో ప్రాంతాన్ని బట్టి గీత వృత్తి, సొసైటీ దారులకు 40 నుంచి 50 శాతం, పోలీసులకు 3 నుంచి 5 శాతం, ఎకై ్సజ్ శాఖకు 10 శాతం, రాజకీయ నేతలకు 10 శాతం చొప్పున నెలనెలా వాటాలు ముట్టచెబుతున్నట్లు సమాచారం. దీంతో కళ్ల ఎదుటే దందా జరుగుతున్నా.. ఎకై ్సజ్ శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎలా తయారు చేస్తున్నారంటే..
100 కేసులు అంటే 2,400 సీసాల కల్లు తయారీకి 2 వేల నుంచి 2,500 లీటర్ల సామర్థ్యమున్న పెద్ద డ్రమ్ములో నీరు పడుతున్నారు. ఇందులో పులుపు, తీపి కోసం కిలో చొప్పున నిమ్మ ఉప్పు/చక్కెర.. తెలుపు రంగు కోసం సిల్వర్ (వైట్).. నురుగుకు పావు కిలో చొప్పున శాక్రిన్, అర కిలో డ్రైఈస్ట్ వేస్తున్నారు. ఆ తర్వాత మత్తు గొలిపేందుకు తగినంత మోతాదులో నిషేధిత ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్)లో ఏదో ఒక దాన్ని ఉపయోగిస్తున్నారు. అధిక శాతం మేర ఆల్ఫ్రాజోలం కలిపి కలబెడుతున్నారు. ఆ తర్వాత ఒక్కో సీసాను ఆయా ప్రాంతాల్లో రూ.10 నుంచి రూ.25కి విక్రయిస్తున్నారు.
కళ్ల ఎదుటే కల్తీ కల్లు విక్రయిస్తున్నా మౌనం
మత్తు పదార్థాల రవాణా, తయారీ కట్టడికే పరిమితం
మామూళ్లే కారణమని
అధికారులపై విమర్శలు
అనారోగ్య సమస్యలతో కూలీల బతుకులు ఛిద్రం
ఆల్కహాలిక్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్‌తో సతమతం


