కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం అండర్–18 జిల్లా అథ్లెట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. త్వరలో హనుమకొండలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం నిర్వహించిన ఎంపిక పోటీల్లో 100 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వాములు మాట్లాడుతూ.. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో సత్తా చాటి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం ప్రతిభకనబరిచిన క్రీడాకారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అంజయ్య, సురేందర్, ప్రసాద్, నిరంజనమ్మ, నారాయణ, తురాబ్, భీమయ్య, జ్యోతి, భారతి పాల్గొన్నారు.


