కొల్లాపూర్: ఎవరైనా 18 ఏళ్లు దాటని అమ్మాయిలకు వివాహాలు చేసినా, వారికి తప్పుడు ధ్రువపత్రాలతో కల్యాణలక్ష్మి చెక్కులు ఇప్పించేందుకు ప్రయత్నించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. కొల్లాపూర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన తర్వాతే అమ్మాయిలకు వివాహాలు జరిపించాలని సూచించారు. తక్కువ వయసులో వివాహం చేయడంతో కలిగే ఆరోగ్యపరమైన సమస్యలను వారికి వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్ మాధవి తదితరులు పాల్గొన్నారు.


