ఓటరు మ్యాపింగ్‌లో స్థానికంగా లేని వారి ఓట్లు తీయాల్సి వస్తుందని అనుకున్నాం. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన తర్వాత గ్రామం విడిచి వెళ్లిన వారు, ఉద్యోగ నిమిత్తం వెళ్లిన వారు ఫోన్లు చేసి వివరాలు చెబుతున్నారు. కొందరు స్వయంగా గ్రామానికి వచ్చి ఫారాలు నింపి ఇస్తున్నారు.
– ఆప్పోజు పద్మ, బీఎల్‌ఓ, ఉప్పునుంతల
పుట్టిన ఊర్లో ఉండాలని..
నేను ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా. ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా వస్తుంటాం. అక్కడ ఓటు వద్దని.. ఇక్కడే ఉంచుకున్నా. ఏ ఎన్నిక వచ్చినా స్వంత ఊరుకు వచ్చి ఓటు వేయడం ఇష్టం. అందుకోసం ఎన్యూమరేషన్ ఫారం నింపి వెళ్లాను. మా ఓటు మా ఊరిలో ఉంటేనే ఆనందం.
– కట్టా జనార్దన్‌రెడ్డి, ఉప్పునుంతల
అర్హులందరికీ ఓటు హక్కు..
అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా బీఎల్‌ఓలు చొరవ చూపాలి. ఆగస్టు 3వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేపట్టి, పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టాక 10న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ఆపై అభ్యంతరాలు స్వీకరించి.. పరిశీలన అనంతరం 12న తుది ఓటరు జాబితా విడుదలవుతుంది. డిజిటలైజేషన్ వందశాతం పూర్తయ్యేలా రాజకీయ పార్టీల నాయకుల సహకరించాలి.
– హేమంత కేశవ పాటిల్, కలెక్టర్


