పాలెం వేంకటేశ్వరస్వామి ఆలయంలో వ్రతాలు ఆచరిస్తున్న భక్తులు
జిల్లావ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి.. ఆలయాల్లో విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలోని ఉమామహేశ్వర క్షేత్రం, లొద్ది మల్లయ్య క్షేత్రాలతో పాటు సోమశిల సోమేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. సోమశిలలోని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. స్వామి దర్శనానికి క్యూ కట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకొని భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు.
9లో..


