కందనూలు: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఫీజు బకాయి.. బీజేపీ లడాయి అంశంపై ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 40లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ. 15వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఫీజులను సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేక, ఉన్నత విద్య చదువుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల బకాయి.. విద్యార్థుల లడాయి పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దన్నోజు నరేశ్‌చారి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహ, కార్యదర్శి తిరుమల్ యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మ ఉన్నారు.
కృష్ణా మండలంలోని
గుడేబల్లూరు వద్ద కృష్ణానదిలో పారుతున్న వరద నీరు


