గిరిజన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు | - | Sakshi
Sakshi News home page

గిరిజన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

Oct 5 2026 12:39 AM | Updated on Oct 5 2026 12:39 AM

పాన్‌గల్‌: గిరిజనుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమానికి సిద్ధం కావాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్‌ పిలుపునిచ్చారు. ఆదివారం పాన్‌గల్‌ మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ గిరిజన సంఘం జిల్లా 3వ మహాసభలో ఆయన మాట్లాడారు. గిరిజన జనాభా ప్రతిపాదికన 10 శాతం రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయకపోవడంతో విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో గిరిజన బిడ్డలు ఎంతో నష్టపోతున్నారన్నారు. గిరిజన తండాలకు ఇప్పటికీ సరైన రోడ్లు, మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంచాయతీలుగా ఏర్పడిన తండాలను రెవెన్యూ జీపీలుగా గుర్తించి, ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఎంతో కాలంగా గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చి, అటవీశాఖ అధికారుల వేధింపులు ఆపాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్‌ అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. గిరిజనులకు దక్కాల్సిన హక్కుల సాధనకు కలిసికట్టుగా పోరాడుతామన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన ప్రణాళికలపై చర్చించి తీర్మానాలు చేశారు. గిరిజనుల వేషధారణలో చిన్నారులు చేసిన నృత్యం అలరించింది. సమావేశంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు రవినాయక్‌, బాల్యానాయక్‌, అనిత, బాలునాయక్‌, హరినాయక్‌, చంద్రూనాయక్‌, గోపినాయక్‌, లక్ష్మణ్‌నాయక్‌, శ్రీధర్‌నాయక్‌, మాత్రునాయక్‌, అన్నారంతండా సర్పంచ్‌ కృష్ణమ్మ, మాజీ సర్పంచ్‌ శాంతమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement