జిల్లాలోని గ్రంథాలయాల్లో పనిచేస్తున్న స్వీపర్లకు నాలుగు నెలల నుంచి జీతాలు రావడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. వారి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం స్వీపర్లకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం.
– ప్రతాప్, జిల్లా గ్రంథాలయాల కార్యదర్శి
గత నాలుగు నెలల నుంచి జీతాలు రాక కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. పిల్లల ఫీజులు, ఇంటి కిరాయిలు అప్పు చేసి కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు చొరవ తీసుకొని వెంటనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
– పవన్, స్వీపర్, తెలకపల్లి గ్రంథాలయం
ప్రతిరోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు గ్రంథాలయంలో విధులు నిర్వహిస్తున్న స్వీపర్లకు వేతనాలు సకాలంలో రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాన్ని నడుపుతున్నాం. అరకొర జీతాలు సరిగా చెల్లించకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది.
– జంబులు, స్వీపర్, కల్వకుర్తి గ్రంథాలయం
జిల్లా, మండల గ్రంథాలయల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉద్యోగులు లేకపోవడంతో పుస్తకాల నిర్వహణ, పాఠకులకు సేవలు అందించడం కష్టంగా మారింది. కొన్నిచోట్ల ఒక్కరే అన్ని పనులు చూసుకునే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చొరవ తీసుకొని సిబ్బందిని నియమించి గ్రంథాలయాలను కాపాడాల్సిన అవసరం ఉంది.
– తిరుపతి, పాఠకుడు
●


