దరఖాస్తు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తు చేసుకోండి

Jul 23 2026 1:30 AM | Updated on Jul 23 2026 1:30 AM

కందనూలు: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రమేశ్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు htt p://bre.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల దరఖాస్తు ఫారం, ఎన్‌ఆర్‌ (రెండు కాపీలు), ఎస్‌బీఐ కలెక్ట్‌ ఫీజు రశీదు కాపీలను సంబంధిత పాఠశాల హెచ్‌ఎం ధ్రువీకరించి.. సెప్టెంబర్‌ 1వ తేదీలోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు తమ కుల, ఆదాయ ధ్రువపత్రాలను జతచేయాలని.. ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షను డిసెంబర్‌ 1న నిర్వహించనున్నట్లు డీఈఓ తెలిపారు.

క్రీడలతో మానసిక,

శారీరక వికాసం

కందనూలు: క్రీడలు మానసిక, శారీరక వికాసానికి ఎంతో దోహదపడతాయని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. బిజినేపల్లి మండలం వట్టెం జవహర్‌ నవోదయ విద్యాలయంలో బుధవారం రాష్ట్రస్థాయి అండర్‌–14, 17, 19 ఖోఖో జట్ల ఎంపికలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. తద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడి.. భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి పునాదిగా నిలుస్తాయన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బీసీ స్టడీ సర్కిల్‌లో

ఉచిత శిక్షణ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీసర్కిల్‌లో గ్రూప్స్‌, ఆర్‌ఆర్‌బీ, ఎస్సెస్సీ, బ్యాకింగ్‌ వంటి పోస్టులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి విష్ణునందన్‌, స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నారాయణపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వచ్చే నెల14లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గతంలో శిక్షణ పొందిన వారు అనర్హులని, మరింత సమాచారం కోసం 74167 31371 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

సమాజం సేవలో

పీయూ ముందుంటుంది

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: సమాజ సేవలో పీయూ ముందుంటుందని వీసీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ధర్మాపూర్‌లో పీయూఎంఎస్‌డబ్ల్యూ విభాగం, ఎస్వీఎస్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్త వహించేందుకు పీయూ తనవంతుగా సేవలు అందిస్తుందన్నారు. ఎక్కడికో వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోకుండా గ్రామానికి వచ్చిన వైద్యులతో పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవాలని కోరారు. ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులు పుస్తక వి/్ఞానంతోపాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని, కార్యక్రమాన్ని నిర్వహించిన అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, సర్పంచ్‌ రాజుగౌడ్‌, డాక్టర్లు పవన్‌కుమార్‌, సింధు, మణికంఠరాజు, ఆప్రీన్‌, విజయ, అంజని, మనోహర్‌, అధ్యాపకుడు గాలెన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement