లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

Jul 23 2026 1:30 AM | Updated on Jul 23 2026 1:30 AM

కందనూలు: ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లలో గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.కృష్ణ హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఆస్పత్రుల్లో అందించే సేవలకు ధరల పట్టికను తప్పనిసరిగా నోటీసు బోర్డులో ఏర్పాటు చేయాలని తెలిపారు. డీఎంహెచ్‌ఓ వెంట ప్రో గ్రాం అధికారి కె.రవికుమార్‌, మాస్‌ మీడియా అధికారి రాజగోపాలాచారి ఉన్నారు.

ఉల్లి @ రూ.3,200

దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్‌లో జరిగిన వేలంలో ఉల్లి ధరలు గత వారం ధరలే పలికాయి. బుధవారం ఉదయం పది గంటలకు జరిగిన వేలంలో క్వింటాల్‌కు గరిష్టంగా రూ.3,200, కనిష్టంగా రూ.2,400 గా నమోదయ్యాయి. సన్నటి పేడు ఉల్లి గరిష్టంగా రూ.2,200, కనిష్టంగా రూ.1,800 పలికింది. ముసురు వానలు కురుస్తుండడంతో మార్కెట్‌కు ఉల్లి అమ్మకానికి తక్కువగా వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement