కందనూలు: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా ఆస్పత్రిలో వైద్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్యం అందించాలని సూచించారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం, అలసత్వానికి తావివ్వొద్దన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో రాజీ పడేది లేదని.. ఆస్పత్రిలో ప్రతి విభాగం సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర తదితరులు ఉన్నారు.


