హమ్మయ్యా.. చల్లబడింది | - | Sakshi
Sakshi News home page

హమ్మయ్యా.. చల్లబడింది

May 28 2026 12:52 AM | Updated on May 28 2026 12:52 AM

మూడురోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో వాతావరణంలో మార్పులు

కల్వకుర్తి టౌన్‌/ కొల్లాపూర్‌/ చారకొండ/ అచ్చంపేట రూరల్‌: జిల్లాలో తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ఉపశమనం కలిగించాయి. మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో బుధవారం మొత్తం వాతావరణం పూర్తిగా చల్లబడింది. అర్ధరాత్రి తర్వాత ఉరుములు, మెరుపులతో మొదలై.. బుధవారం తెల్లవారుజాము వరకు దాదాపు 3 గంటలపాటు భారీ వర్షం కురిసింది. జిల్లాలోని అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. అత్యధికంగా తిమ్మాజిపేటలో 88.8 మి.మీ., కల్వకుర్తిలో 80.2 మి.మీ.,ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లోకి స్వల్పంగా వర్షపునీరు చేరింది. దీనికితోడు నాలుగు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆరుతడి పంటల సాగులో నిమగ్నమయ్యారు. చాలాచోట్ల ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు పత్తి విత్తనాలు నాటగా.. మరికొందరు పొలాల్లో దుక్కి దున్నే పనులు చేపట్టారు.

జిల్లావ్యాప్తంగా మంగళవారం

అర్ధరాత్రి దంచికొట్టిన వర్షం

అత్యధికంగా తిమ్మాజిపేటలో 88.8 మి.మీ., వర్షపాతం

ఆరుతడి పంటల సాగులో నిమగ్నమైన రైతులు

Advertisement
 
Advertisement
Advertisement