అమ్రాబాద్: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొంటుందని.. ఎవ రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. ఆదివారం అమ్రాబాద్ మార్కెట్‌యార్డులో మొక్కజొన్న కొ నుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మా ట్లాడారు. అమ్రాబాద్ సబ్‌యార్డులో అన్ని వసతులు కల్పించి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా మల్లేష్, వైస్‌చైర్మన్ వెంకటయ్య, పీఏసీఎస్ వైస్‌చైర్‌పర్సన్ మంగమ్మ, సర్పంచ్ కోటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రహీం, హరినారాయణగౌ డ్, మోహన్‌గౌడ్, బాలింగంగౌడ్ పాల్గొన్నారు.


