పీహెచ్‌సీలకు పైసల్లేవ్‌..! | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీలకు పైసల్లేవ్‌..!

May 2 2026 8:32 AM | Updated on May 2 2026 8:32 AM

ఉమ్మడి జిల్లాలోని 69 పీహెచ్‌సీలకు అందని నిధులు

త్వరలోనే రావొచ్చు..

ఎస్‌జీఎఫ్‌ చాంపియన్‌
ఢిల్లీ

తమిళనాడుతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో

ఘన విజయం

వాకోవర్‌తో మూడోస్థానంలో నిలిచిన ఉత్తరాఖండ్‌

క్రీడాకారులకు క్రీడాస్ఫూర్తి చాటారు : డీఈఓ ప్రవీణ్‌కుమార్‌

– జడ్చర్ల టౌన్‌

వివరాలు 8లో..

పాలమూరు: ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ భారంగా మారుతోంది. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా ప్రతి పీహెచ్‌సీకి హెచ్‌డీఎఫ్‌ (హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌) నిధులు రాక వసతులు సమకూర్చుకోలేని పరిస్థితి దాపురించింది. మరోవైపు పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీకి ఎంపీపీలు అధ్యక్షులుగా ఉండి విడుదలయ్యే నిధులపై పర్యవేక్షిస్తుండేవారు. వారి పదవీకాలం ముగిసి రెండేళ్లు గడుస్తుండటంతో వీటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో క్షేత్రస్థాయిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందడానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సరైన వసతుల కల్పన లేకపోవడంతో చాలా వరకు వైద్యాధికారులు పీహెచ్‌సీల వైపు చూడటం లేదు.

చివరగా 2023 మార్చిలో..

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 17 పీహెచ్‌సీలు, ఆరు యూపీహెచ్‌సీలకు, మూడు సీహెచ్‌సీలకు గత మూడేళ్లుగా నిధుల కేటాయింపు లేవు. చివరగా 2023 మార్చిలో రూ.59.46 లక్షల నిధులు విడుదల కాగా.. దీంట్లో రూ.37.14 లక్షలు ఖర్చు చేశారు. తాజాగా ఈ ఏడాది మార్చిలో కాయకల్ప కింద కేవలం 9 పీహెచ్‌సీలకు కలిపి రూ.6 లక్షలు విడుదల చేయగా దీంట్లో ఒక్కో పీహెచ్‌సీకి రూ.50 వేల చొప్పున.. ఒక్క రాజాపూర్‌ పీహెచ్‌సీకి మాత్రం రూ.2 లక్షలు విడుదల చేశారు.

గద్వాల జిల్లాలో గత మూడేళ్లు నిధులు లేకపోవడంతో పీహెచ్‌సీల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. ఈ ఏడాది మార్చిలో కాయకల్ప కింద ఆరు పీహెచ్‌సీకు రూ.6.35 లక్షలు విడుదలైన నిధులు తప్పా ఇతర బడ్జెట్‌ రాలేదు.

వనపర్తి జిల్లాలో కేవలం హెచ్‌డీఎస్‌ కింద 2023– 24 ఏడాదిలో మొత్తం 13 పీహెచ్‌సీలలో ఒక్కోదానికి రూ.1.39 లక్షలు విడుదల చేయగా.. 2024– 25లో ఒక్కో పీహెచ్‌సీకి రూ.61,579 విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి నిధుల కేటాయింపులకు నోచుకోలేదు.

నారాయణపేట జిల్లాలో 11 పీహెచ్‌సీలు ఉండగా 2023 అక్టోబర్‌ నుంచి హెచ్‌డీఎస్‌ నుంచి కానీ కాయకల్ప విభాగం ఎలాంటి నిధులు విడుదల చేయలేదు.

ఏటా ఆస్పత్రి అభివృద్ధి నిధి..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 69ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. నేషనల్‌ హెల్త్‌ హెల్త్‌ మిషన్‌ కింద ప్రతి ఏటా ఆస్పత్రి అభివృద్ధి నిధి కింద ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.50 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యేవి. వీటి ద్వారా ఆయా పీహెచ్‌సీల్లో అభివృద్ధి కమిటీ తీర్మానం మేరకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేవారు. అయితే గత మూడేళ్లుగా నిధులు మంజూరు ఊసేలేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వైద్య అవసరాలు, రోగుల తాకిడికి అనుగుణంగా కనీస సౌకర్యాలు లేక పీహెచ్‌సీకి వచ్చిన రోగులతోపాటు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ వస్తువులు మరమ్మతుకు గురైనా వాటిని బాగు చేయించే పరిస్థితి లేక సిబ్బంది సతమతమవుతున్నారు.

అవసరాలు తీరేదెలా?

బడ్జెట్‌ కేటాయింపు లేకపోవడంతో పీహెచ్‌సీల్లో అవసరాలు తీర్చడం కష్టంగా మారింది. ప్రధానంగా పీహెచ్‌సీ భవనంలో చిన్నపాటి మరమ్మతు, పరిసరాలు శుభ్రం చేయడానికి వర్కర్లకు కూలీ, చిన్నపాటి పరికరాలు, బ్లడ్‌గ్రూప్‌ టెస్ట్‌ కిట్ల కొనుగోలు, విద్యుద్దీపాలు, టాయిలెట్స్‌ నిర్వహణ, రిజిస్టర్లు కొనుగోలు ఇలా ప్రతీది సమస్యగా మారింది. ప్రధానంగా పీహెచ్‌సీ పరిధిలోని గర్భిణులతోపాటు దీర్ఘకాలిక రోగులు ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటే తప్పక ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉండాలి. దీనికి ఏటా రూ.6 వేల వరకు ఖర్చు అవుతుంది. వీటికి కూడా నిధులు లేకపోవడంతో పలుచోట్ల వైద్యాధికారులే సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు.

గత మూడేళ్లుగా విడుదల కాని

హెచ్‌డీఎస్‌, కాయకల్ప బడ్జెట్‌

నిర్వహణకు సైతం అవస్థలు..

పేరుకుపోతున్న సమస్యలు

జిల్లాల నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నా కనికరించని ప్రభుత్వం

నెట్‌ సదుపాయం కోసం సొంతంగా చెల్లిస్తున్న వైద్యాధికారులు

ఇటీవలే ప్రభుత్వానికి బడ్జెట్‌ విషయంపై పలుమార్లు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రస్తుతమైతే కలెక్టర్‌ దగ్గర అదనపు నిధులు తీసుకున్నాం. వాటిలో నుంచి పీహెచ్‌సీల నిర్వహణ కోసం కొంత ఖర్చు చేస్తున్నాం. చిన్నపాటి నిర్వహణ ఖర్చులు మెడికల్‌ ఆఫీసర్లు భరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు త్వరలో వస్తాయని అనుకుంటున్నాం.

– సాయినాథ్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ, వనపర్తి

Advertisement
 
Advertisement
Advertisement