నెల్లికొండ మార్కెట్‌లో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి 22 రోజుల క్రితం 320 బస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చాను. కొనుగోలు చేశారు కానీ ఈ రోజు వరకు లారీ రావడం లేదు. ఇంటి వద్ద అన్ని పనులు వదిలేసి ఇక్కడే పడిగాపులు కాస్తున్నా.
– రామకృష్ణ, రైతు, తూడుకుర్తి,
నాగర్‌కర్నూల్ మండలం
రైతులు అనేక కష్టాలు పడి పండించిన పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నాం. 200 బస్తాల మొక్కజొన్న తెచ్చి 10రోజులు అవుతుంది. లారీల కొరత, లేబరు కొరత అని అధికారులు చెబుతున్నారు. సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నాం. ఇంకా ఎన్ని రోజులవుతుందో తెలుస్తలేదు. మా బాధలు ఎవరికి చెప్పాలో తెలియడం లేదు.
– రాంరెడ్డి, రైతు,
దేశిటిక్యాల, నాగర్‌కర్నూల్ మండలం
నేను 260 బస్తాల ధాన్యం మార్కెట్‌కు తెచ్చి 25 రోజులవుతుంది. ఇప్పటి వరకు ధాన్యాన్ని లారీలకు ఎత్తడం లేదు. అధికారులను ఎన్ని సార్లు అడిగినా లారీలు ఈ రోజు వస్తాయి.. రేపు వస్తాయని అంటున్నారు. రైతుల గోస ఎవరికీ పట్టడం లేదు.
– వెంకటయ్య, రైతు,
రాయిపాకుల, తెలకపల్లి మండలం
●


