అర్జీల పరిష్కారంపై దృష్టి సారించండి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంపై దృష్టి సారించండి

Mar 24 2026 8:38 AM | Updated on Mar 24 2026 8:38 AM

కందనూలు: ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందిన దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ లాల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, కలెక్టరేట్‌ ఏఓ చంద్రశేఖర్‌తో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యా దులను క్షుణ్ణంగా పరిశీలించి.. పరిష్కార మార్గం చూపాలన్నారు. కాగా, ప్రజావాణిలో 34 అర్జీలు అందినట్లు సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement