కందనూలు: జిల్లావ్యాప్తంగా శనివారం ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద మత గురువు హఫీజ్‌అన్వరుల్‌హక్ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ సందర్భంగా రంజాన్ ప్రాముఖ్యతను వివరించారు. మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో అందరూ పయనించాలని సూచించారు. జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునేంద్రకుమార్, వైస్ చైర్మన్ రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు పాల్గొన్నారు.


