నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం మొక్కజొన్నను తీసుకువచ్చి మద్దతు ధరకు ఇక్కడి కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, వైస్ చైర్మన్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.


