నానో యూరియా, డీఏపీతో అధిక దిగుబడులు
నాగర్‌కర్నూల్: నానో యూరియా, నానో డీఏపీ వాడటం వల్ల రైతులు నష్టాలను నివారించవచ్చని, ప్రతి రైతు ఈ యాసంగిలో కనీసం ఎకరాలో వీటిని వాడాలని జిల్లా వ్యవసాయాధికారి యశ్వంత్‌రావు అన్నారు. కోరమాండల్ కంపెనీ ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ఈ యూరియా, డీఏపీ వాడడం వల్ల పంటల దిగుబడి నాణ్యత పెరుగుతుందన్నారు. అంతకు ముందు కొరమాండల్ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో 2019– 20లో 29,586 టన్నుల యూరియా అమ్మకాలు ఉండగా 2024–25లో 57,224 టన్నులకు పెరిగాయన్నారు. సంప్రదాయ యూరియా అధికంగా వాడడం వల్ల భూమిలో సేంద్రియ పదార్థాలు తగ్గిపోతాయన్నారు. రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల పంటలకు ఉపయోగపడే ఇతర పోషకాలు కూడా అందవన్నారు. ప్రతి రైతు నానో యూరియా, నానో డీఏపీని వాడి పంటలను రక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కొరమాండల్ ప్రాంతీయ వ్యాపార నిర్వా హకుడు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.


