తొలిరోజు 121 నామినేషన్లు
● వార్డు స్థానాలకు 26 దాఖలు
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో గురువారం ఉదయం 10.30 గంటల నుంచి తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. తొలి విడతలో ఆరు మండలాల పరిధిలోని 151 సర్పంచ్, 1,326 వార్డు స్థానాలకు నామినేషన్లను స్వీకరించగా.. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 121, వార్డు స్థానాలకు 26 నామినేషన్లు వచ్చాయి. సర్పంచ్ స్థానాలకు కల్వకుర్తి మండలంలో 19, ఊర్కొండ మండలంలో 11, వెల్దండ మండలంలో 19, వంగూరులో 24, తాడూరులో 23, తెలకపల్లిలో 25 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుస్థానాలకు కల్వకుర్తి మండలంలో 11, వెల్దండ మండలంలో 6, వంగూరు మండలంలో 2, తాడూరు మండలంలో 5, తెలకపల్లి మండలంలో 2 నామినేషన్లు రాగా.. ఊర్కొండ మండలంలో వార్డుస్థానాలకు నామినేషన్లు రాలేదు.


