క్షయ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లాలోని ప్రతిగ్రామాన్ని క్షయ రహిత పల్లెలుగా తీర్చిదిద్దాలని డీఎంహెచ్‌ఓ రవికుమార్ అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ మండలంలోని గడ్డంపల్లి గ్రామంలో ప్రధానమంత్రి టీబీ భారత్ అభియాన్‌లో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో క్షయవ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన శిబిరాన్ని ఆకస్మికంగా సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ప్రతిఒక్కరు తమ ప్రాంతాన్ని క్షయ రహితంగా తయారు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. క్షయవ్యాధి అనుమానితులందరినీ గుర్తించి ఎక్సురే పరీక్షల వ్యాధిని అంతం చేయగలమన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన బాధితులు త్వరగా కోలుకోవడానికి పోషక ఆహార కిట్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని 150 మందికి ఎక్సురే పరీక్షలు నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ ఈఓ బ్రహ్మేందర్, అంజనమ్మ, వసంత, పరిమళ, బాలమణెమ్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


