అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటాలి
కల్వకుర్తి రూరల్: గ్రామీణ క్రీడాకారులు అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి డా.స్వాములు అన్నారు. ఆదివారం కల్వకుర్తిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ పోటీలు నిర్వహించగా.. జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన 150 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2, 4, 6, 8, 10 కి.మీ. క్రాస్ కంట్రీ రన్నింగ్‌లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు స్వాములు బహుమతులను ప్రదానం చేశారు. జిల్లాస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన క్రీడాకారులు జనవరి 4న హైదరాబాద్‌లోని బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించే 11వ తెలంగాణ రాష్ట్ర క్రాస్ కంట్రీ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఏకాగ్రతతో ఆడి సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో భిక్షపతి యాదవ్, ప్రసాద్, మల్లేష్, అరుణ, జాఫర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.


