మాకు న్యాయం జరిగేలా చూడాలి..
తన బిడ్డ పేరుతో కంపెనీ మొదలు పెట్టానని.. ఎలాంటి మోసానికి అవకాశం లేదని ఆయుర్వేద నిలయం యజమాని తెలిపాడు. ఆయుర్వేద ఉత్పత్తులకు కావాల్సి మెటీరియల్‌ను చెంచులు తక్కువ ధరతో ఇస్తారని.. పెట్టుబడి రూ.3 వేలు అయితే తమకు రూ.30 వేలు వస్తాయని నమ్మబలికాడు. దీంతో ఇంట్లో ఆడవాళ్ల మీద ఉన్న బంగారు పుస్తెల తాడు, నెక్లెస్ అన్నీ బ్యాంక్‌లో కుదవ పెట్టి, ప్లాటు అమ్మి రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసి మోసపోయా. నాతో పాటు పలు కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మాకు అన్యాయం జరగకుండా చూడాలి. – జానంపేట ఆంజనేయులు, చిన్నగుమ్మడం, పెబ్బేరు, వనపర్తి


