ఫ్లెక్సీల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీల తొలగింపు

Nov 20 2025 7:18 AM | Updated on Nov 20 2025 7:18 AM

ఫ్లెక

ఫ్లెక్సీల తొలగింపు

కందనూలు: hÌêÏ MóS…{§ýl…ÌZ° {糫§é¯]l Æý‡çßæ-§é-Æý‡$-ÌSOò³ {sêíœMŠSMýS$ A…™èl-Æ>Ķæ$… MýSÍ-W…-^ólÌê òœÏMîSÞË$ HÆ>µr$ ^ólĶæ$yýl…Oò³ Gïܵ OVðSM>ÓyŠæ OÐðl¿ýæÐŒæ Æý‡çœ¬-¯é£Šl B{VýSçßæ… Ð]lÅMýS¢…^ól-Ô>Æý‡$. °º…-«§ýl-¯]l-ÌSMýS$ ÑÆý‡$-§ýl®…V> HÆ>µ-r$^ól-íܯ]l òœÏMîSÞÌS ™öÌS-W…-ç³#¯]lMýS$ º$«§ýl-ÐéÆý‡… ´ùÎ-çÜ$Ë$ òܵçÙÌŒæ {OyðlÐŒæ️ ^ólç³sêtÆý‡$. Æý‡çßæ-§é-Æý‡$ÌS Ððl…r {ç³Ð]l*-§ýl-MýS-Æý‡…V> E¯]l² òœÏMîSÞ Ë$, »êů]l-Æý‡Ï¯]l$ ™öÌS-W…-^éÆý‡$. Ð]l¬°Þ-´ë-Ísîæ A ¯]l$-Ð]l$-™èl$Ë$ ÌôæMýS$…yé Ayýlz-Vø-Ë$V> òœÏMîSÞÌS¯]l$ HÆ>µr$ ^ólĶæ$-yýl…™ø {ç³Ð]l*§éË$ ^ør$ ^ólçÜ$-MýS$…-r$-¯é²Æ‡$$. ©…™ø ´ùÎçÜ$ íܺ¾…§ól òœÏMîSÞÌS ™öÌS-W…ç³# ^ólç³sêtÆý‡$.

ఉపాధ్యాయుడిపై

సస్పెన్షన్‌ వేటు

కందనూలు: పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యా ర్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఆంగ్ల ఉపాధ్యాయుడు వపన్‌ జైన్‌ను సస్పెన్షన్‌ చేస్తూ బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఉపాధ్యాయుడు కొన్ని రోజులుగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు చేరుకొని దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్దకొత్తపల్లి ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి విచారణ చేపట్టి డీఈఓకు నివేదిక సమర్పించారు. విచారణ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు అతడిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

కార్మిక వ్యతిరేక

విధానాలపై పోరాటం

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కార్మికులు సిద్ధం కావాలని అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పార్వతమ్మ పిలుపునిచ్చారు. బుధ వారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాల యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మా ట్లాడారు. నూతన జాతీయ విద్యావిధానం, అంగన్‌వాడీలకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పెన్షన్‌ తదితర సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఆదిలాబాద్‌లో నిర్వహించే యూనియన్‌ రాష్ట్ర మహాసభల్లో కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. మహాసభలకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామయ్య, మాసమ్మ, అలివేల, చిట్టెమ్మ, లక్ష్మి, కృష్ణవేణి, భాగ్యమ్మ తదితరులు ఉన్నారు.

వీరవనిత

ఝాన్సీ లక్ష్మీబాయి

కందనూలు: స్వతంత్ర రాజ్యస్థాపన కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి అని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ శివశంకర్‌గౌడ్‌ కొనియాడారు. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో సీ్త్రశక్తి దివాస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి ప్రముఖ పాత్ర పోషించారన్నారు. నేటి యువత ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పద్మజ, సుధాకర్‌, ఏబీవీపీ నాయకులు బంగారు బాబు, ప్రసాద్‌కుమార్‌, శివ, విష్ణు, జీవన్‌, శివ, దేవిక, కీర్తన, డానియల్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

ఫ్లెక్సీల తొలగింపు 
1
1/1

ఫ్లెక్సీల తొలగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement