త్వరగా అందించాలి..
యాసంగి సీజన్ ప్రారంభమై 20 రోజులు అయితుంది. ఇప్పటికీ రెండు ఎకరాల్లో మొక్కజొన్న విత్తనాలు వేసుకున్నాను. మరో మూడెకరాల్లో వేరుశనగ వేసేందుకు ప్రయత్నిస్తున్నా ఇటీవల కురిసిన వర్షాలకు పంట అంతా నాశనమైంది. చేతిలో చిల్ల గవ్వ కూడా లేదు. ప్రభుత్వం తక్షణమే పెట్టుబడి సాయం అందిస్తే వడ్డీ వ్యాపారులతో అప్పు తీసుకునే ముప్పు తప్పుతుంది.
– సుధాకర్, రైతు, గట్టురాయిపాకుల, తెలకపల్లి మండలం
పంట నష్టపోయినం
నాకున్న ఎకరా పొలంలో వరి పంట వేశాను. ఇటీవల కురిసిన వర్షాలకు వరి పంట పూర్తిగా నీట మునిగింది. పంట కోతకు వచ్చినా కోసుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఇప్పటి వరకు అధికారులు ఎవరూ పంటను పరిశీలించలేదు. ఇకనైనా అధికారులు స్పందించి ఆదుకోవాలి. అలాగే యాసంగి పంటకు పెట్టుబడి సాయం అందించాలి.
– శ్రీశైలం, రైతు, ఆవంచ, తిమ్మాజిపేట మండలం
ఆదేశాలు రాలేదు..
రైతులకు పెట్టుబడి సాయానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. రైతులు, వారి ఖాతాలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్దే ఉంటాయి. దానిని బట్టి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. కొత్తగా పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది.
– యశ్వంత్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి
●
త్వరగా అందించాలి..


