సమసమాజ నిర్మాణమే సీపీఐ లక్ష్యం
నాగర్‌కర్నూల్ రూరల్/ తిమ్మాజిపేట/ బిజినేపల్లి/ తెలకపల్లి/ అచ్చంపేట రూరల్: దేశంలో ఆర్థిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణమే సీపీఐ లక్ష్యం అని పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని చేపట్టిన సీపీఐ ప్రచార జాతా సోమవారం తిమ్మాజిపేట, బిజినేపల్లి మీదుగా నాగర్‌కర్నూల్ చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. వందేళ్లుగా ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఏకై క పార్టీ సీపీఐ అన్నారు. సీపీఐ పార్టీ వందేళ్ల త్యాగాల చరిత్రను నేటి సమాజానికి తెలియజేయడానికి ప్రచార జాతా నిర్వహించడం జరుగుతుందన్నారు. వచ్చే నెల 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు తిమ్మాజిపేట, బిజినేపల్లి, తెలకపల్లిలో చేపట్టిన ప్రచార జాతాలో పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.బాల్‌నర్సింహ, జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్ తదితరులు మాట్లాడారు. రాత్రికి అచ్చంపేట పట్టణానికి చేరుకుంది. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు ఆనంద్‌జీ, రాష్ట్ర సమితి సభ్యుడు కేశవ్‌గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సింహ, చంద్రమౌళి, విజయుడు, జిల్లా సమితి సభ్యులు శ్రీనివాస్, శ్రీను, లక్ష్మీపతి, శివశంకర్, మధుగౌడ్, ఆంజనేయులు, మల్లయ్య, వెంకటమ్మ, కిరణ్‌కుమార్, శివుడు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ కార్యదర్శి,
మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి


