వైభవోపేతంగా కోటి దీపోత్సవం
అచ్చంపేట: అచ్చంపేట శ్రీచక్ర సహిత శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆయలంలో సోమవారం రాత్రి అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీభ్రమరాంబ, మల్లిఖార్జున శివపార్వతుల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కన్యకా పరమేశ్వరిదేవి ఆలయ ఉత్తర ద్వారమైన పార్కింగ్ స్థలంలో జ్యోతి ప్రజ్వలన, అనంతరం కనుల పండువగా కోటి దీపోత్సవం నిర్వహించారు. ఇందులో వేయి మంది భక్తులు పాల్గొని దీపాలు వెలగించారు. వాసవీ చారిటబుల్ ట్రస్ట్ దీపోత్సవంలో పాల్గొనే మహిళలకు ప్రమిదలు, ఒత్తులు, నూనె, కుంకుమ, పసుపు వస్తువులను అందజేశారు. సాయంత్రం వేదపఠనం, ఆధ్యాత్మిక గాయకులు ప్రేమ్‌రాజ్‌చే సంగీత కచేరి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బాలరాజు, కోశాధికారి శ్రీనివాసులు, చంద్రకుమార్, కర్ణస్వామి, వినోద్, నరేష్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
వైభవోపేతంగా కోటి దీపోత్సవం


