పొంచి ఉన్న ముప్పు!
సింగోటం రిజర్వాయర్ సమీపంలో మైనింగ్ తవ్వకాలు
పంప్‌హౌజ్‌ల
సమీపంలోనూ..
కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు సమీపంలోనే ఎంజీకేఎల్‌ఐ, పాలమూరు ప్రాజెక్టులు, వాటి పంప్‌హౌజ్‌లు ఉన్నాయి. ఇటీవల వీటికి అతి సమీపంలోని తువ్వగట్టుపై ఉన్న చెట్లను నరికేసి, భూమి చదును చేసే పనులు చేపట్టారు. దీనిపై ఇప్పటికే రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. 300 అడుగులకు పైగా ఎత్తులో ఉన్న తువ్వగట్టును చదును చేయడం వల్ల భూమి పొరల్లో మార్పులు రావొచ్చని.. ఇవి ప్రాజెక్టులకు భవిష్యత్‌లో ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడవిలో ఉన్న తువ్వగట్టును చదును చేస్తుంటే.. అటవీ, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక అనుమా నా లు తలెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టుల పరిరక్షణపై దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు.
కొల్లాపూర్: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ఎంజీకేఎల్‌ఐ, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు భవిష్యత్‌లో ప్రమాదం ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం సమన్వయ లోపం కారణంగా ప్రాజెక్టుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. వాటి సమీపంలో ఇష్టానుసారంగా చెట్ల నరికివేత, మైనింగ్, మట్టి తవ్వకాలు చేపడుతుండటంతో ప్రాజెక్టులపై ప్రభావం చూపనున్నాయి.
సింగోటం రిజర్వాయర్ వద్ద..
ఎంజీకేఎల్‌ఐ ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన సింగోటం రిజర్వాయర్ సమీపంలో వైట్‌క్వార్జ్ నిక్షేపాల వెలికితీత పనులు సాగుతున్నాయి. రత్నగిరి కొండను హద్దుగా ఏర్పాటుచేసి.. సింగోటం రిజర్వాయర్ నిర్మించారు. ఈ కొండపైనే మైనింగ్ తవ్వకాలు దశాబ్ద కాలంగా కొనసాగుతున్నాయి. తవ్వకాలు ప్రారంభించిన తొలినాళ్లలో సింగోటం గ్రామస్తులు న్యాయపోరాటం చేసి పనులను అడ్డుకున్నారు. తర్వాతి కాలంలో మళ్లీ అనుమతులు తెచ్చుకున్న గుత్తేదారులు.. తిరిగి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఖనిజ నిక్షేపాల వెలికితీత కోసం బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. కొండకు చివరి భాగంలో మొదటి విడతలో అనుమతులు ఇచ్చిన మైనింగ్ అధికారులు.. కొంతకాలం క్రితమే కొండ మధ్య భాగంలో కూడా క్వార్జ్ నిక్షేపాల వెలికితీతకు రెండో విడత అనుమతులు ఇచ్చారు. దీంతో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఈ కొండ ఉనికి కోల్పోయే ప్రమాదం నెలకొంది. కొండ ప్రాంతం దెబ్బతింటే.. సింగోటం రిజర్వాయర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
‘ఏదుల’ వద్ద గుట్టలను తోడేస్తున్న అక్రమార్కులు
ప్రమాదంలో ఎంజీకేఎల్‌ఐ, పాలమూరు ప్రాజెక్టులు
పట్టించుకోని అధికార యంత్రాంగం
గుట్టలను పరిశీలిస్తాం..
పాలమూరు, కేఎల్‌ఐ పంప్‌హౌజ్‌ల సమీపంలో చదును చేస్తున్న తువ్వగట్టు ప్రాంతాన్ని పరిశీలిస్తాం. చెట్లను తొలగిస్తే ఇబ్బంది ఏమీ లేదు. మట్టి తవ్వకాలు ఎంత లోతుకు జరుగుతున్నాయో తెలుసుకుంటాం. సింగోటం రిజర్వాయర్ సమీపంలోని రత్నగిరి కొండపై మైనింగ్ తవ్వకాలకు ఎంత మేరకు మైనింగ్‌శాఖ అనుమతులు ఇచ్చిందనే విషయాలపై ఆరా తీస్తాం. రిజర్వాయర్‌కు ప్రమాదకరమా.. లేదా అనేది చూసి, నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ


