కనులపండువగా కల్యాణ మహోత్సవం
అచ్చంపేట రూరల్: అచ్చంపేటలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం సామూహిక వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కౌన్సిలర్ గోపిశెట్టి శివ (అప్ప శివ) – గాయత్రి దంపతుల చేతులమీదుగా నిర్వహించిన వివాహ వేడుకల్లో 61 జంటలు ఒక్కటయ్యాయి. ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ – అనురాధ దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. నూతన వధూవరులకు అప్ప శివ అందించిన పట్టువస్త్రాలు, బంగారు తాళి, మెట్టెలను అందజేశారు. అచ్చంపేటలో మొదటిసారిగా నిర్వహించిన సామూహిక వివాహ వేడుకలను చూసేందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. కల్యాణం అనంతరం కొత్త దంపతులకు బీరువా, మంచం, ఇతర వంటసామగ్రి అందజేసి.. భారీ ఊరేగింపు మధ్య స్వగ్రామాలకు పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ... అచ్చంపేటలో ఎన్నడూ లేని విధంగా అప్ప శివ – గాయత్రి దంపతులు సామూహిక వివాహాలు చేయడం గొప్ప విష యమన్నారు. ఆయన్ను అభినందించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఒకే వేదికపై ఒక్కటైన 61 జంటలు
కనులపండువగా కల్యాణ మహోత్సవం


