ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు
ఉప్పునుంతల: దుందుభీ, ఇతర వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ అమరేందర్ హెచ్చరించారు. ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి సమీపంలోని వ్యవసాయ పొలాల నుంచి దుందుభీ వాగు వరకు దారిని ఏర్పాటుచేసి.. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఇటీవల కొందరు గ్రామస్తులు కలెక్టర్, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన వాగును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పొలాల నుంచి వాగు వరకు ఏర్పాటుచేసిన దారిని చూశారు. టిప్పర్లలో ఇసుక తరలింపుతో రోడ్డు దెబ్బతినడంతో పాటు రాకపోకలు సాగించలేకపోతున్నామని గ్రామస్తులు అదనపు కలెక్టర్‌కు వివరించారు. ఇకపై ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్థానిక తహసీల్దార్ సునీత ను ఆయన ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట ఆర్‌ఐ రామకృష్ణ, జీపీఓ రాము ఉన్నారు.
పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
పెద్దకొత్తపల్లి: చలికాలంలో పశువులకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. వాటి ఆరోగ్యంపై పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా.జ్ఞానశేఖర్ అన్నారు. గురువారం మండలంలోని చంద్రకల్‌లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామన్నారు. ప్రతి పశువుకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. అదే విధంగా గొర్రెలు, మేకలు, పశువులు, గేదెలకు బీమా చేయించాలన్నారు. పాలిచ్చే పశువులకు బలమైన ఆహారం అందించాలన్నారు. పశువైద్యఽశాలల్లో గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని.. కావాల్సిన రైతులకు 75శాతం సబ్సిడీతో అందించనున్నట్లు తెలిపారు మండల పశువైద్యాధికారి డా.అశోక్, సిబ్బంది సనా, నిరంజన్, రాజు, వేమారెడ్డి, శివ, కర్ణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
తువ్వగట్టు భూములపై విచారణ జరపాలి
కొల్లాపూర్: మండలంలోని ఎల్లూరు సమీపంలో ఉన్న తువ్వగట్టు భూముల అన్యాక్రాంతంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాల్‌నర్సింహ డిమాండ్ చేశారు. సీలింగ్ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం కొల్లాపూర్‌లో సీపీఐ నాయకులు ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్‌నర్సింహతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి ఫయా జ్ మాట్లాడుతూ.. ఎల్లూరు సమీపంలోని సర్వేనంబర్ 359, 360, 364, 365లో ఉన్న ప్రభుత్వ సీలింగ్ భూమిని 2008లో సురభి రాజవంశస్థుల పేరిట పట్టా భూమిగా రికార్డుల్లో మార్చారన్నారు. అడవిని రాజ కుటుంబీకులకు పట్టా చేయడంలో ఎవరి హస్తం ఉందో వెల్లడించాలన్నారు. వారు గ్రీన్ ట్రిబ్యునల్, వాల్టా, ఫారెస్టు యాక్టులను అతిక్రమించి అడవిని నరికేసినా జిల్లా అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం సరైంది కాదన్నారు. పేద రైతులు రెండు ఎకరాల పోడు సాగు చేసుకుంటే వందలాది ఫారెస్టు, పోలీసు అధికారులు వచ్చి భయబ్రాంతులకు గురిచే స్తున్నారని.. 50 ఎకరాల మేరకు అడవిని నరికేసిన వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేద ని ప్రశ్నించారు. తువ్వగట్టు భూముల అన్యాక్రాంతంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించాలని వారు కోరారు. సీలింగ్ భూములను కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని సీపీఐ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. అనంతరం తహసీల్దార్ భరత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పెబ్బేటి విజ యుడు, తుమ్మల శివుడు, కురుమయ్య, మల్ల య్య, యూసూఫ్, రామకృష్ణ, శేఖర్, జంగం శివుడు, చందు, రవి, పవన్ పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు


