రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కల్వకుర్తిరూరల్: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని జీడిపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు కృషిచేస్తానని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తుండటంతో ఈ ప్రాంతంలో రైతులు పెద్ద మొత్తంలో వరిసాగు చేశారని.. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ బాలాజీ సింగ్, సంజీవ్‌యాదవ్, అశోక్‌రెడ్డి, ఆనంద్‌కుమార్, హరీశ్‌రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, కొండల్, భీ మ్లానాయక్, విజయభాస్కర్, జయపాల్‌రెడ్డి, వెంకటేశ్, సీఈఓ వెంకట్‌రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


