ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
తిమ్మాజీపేట: ఆర్టీసీ ప్రాంగణాల్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మహబూబ్‌నగర్ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ అన్నారు. తిమ్మాజీపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన సిమెంటు కుర్చీలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో కల్పించాల్సిన సౌకర్యాలపై ఆరా తీశారు. దాతల సహకారంతో బస్టాండ్‌ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య, ఇతర ఉద్యోగులపాల్గొన్నారు.
కార్మికులను శ్రమదోపిడీకి గురిచేస్తున్న ప్రభుత్వం
వెల్దండ: ప్రభుత్వం కార్మికుల శ్రమకు తగిన వేతనం ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాసమ్మ ఆరోపించారు. మంగళవారం మండలకేంద్రంలో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం, గ్రామపంచాయతీ తదితర కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఈ నెల 30న నిర్వహించే సీఐటీయూ జిల్లా మహాసభలకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మండల కమిటీని ఏర్పాటుచేశారు. సమావేశంలో మండల కన్వీనర్ మాసమ్మ, సభ్యులు స్వప్న, యాదమ్మ, జాహెదా, స్వరూప, వినోద్, యాదయ్య, చంద్రశేఖర్, రామచంద్రయ్య, భీమరాజు తదితరులు ఉన్నారు.
భక్తిశ్రద్ధలతో కార్తీక దీపారాధన
కందనూలు: జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం కార్తీక దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో పరమశివుడికి అభిషేకాలు, అర్చనలు చేసిన అనంతరం మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా రోజు ఉదయం ప్రదోష కాలంలో అభిషేకాలు, సాయంత్రం సామూహిక కార్తీక దీపారాధన, ఆకాశ దీపోత్సవం, విష్ణు సహస్రనామ పారాయణ పఠనం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు.
కురుమూర్తిస్వామికి రూ.24.83లక్షల ఆదాయం
చిన్నచింతకుంట: అమ్మాపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులు కానుకలుగా సమర్పించిన రెండో హుండీని మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. రూ.24,83,628 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ పరిశీలకులు శ్రీనివాస్, ఆలయ పాలక మండలి సభ్యులు భారతమ్మ, బాదం వెంకటేశ్వర్లు, గౌని రాము, నాగరాజు, కమలాకర్, ప్రభాకర్‌రెడ్డి, ఉంధ్యాల శేఖర్, ఆలయ పూజా రులు వెంకటయ్య, సత్యనారాయణ, విజయ్‌లక్ష్మి నరసింహచార్యులు, పాల్గొన్నారు.
ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం


