ఉత్సాహంగా క్రీడా పోటీలు
వనపర్తి రూరల్: వనపర్తి మండలం చిట్యాల మహా త్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఆర్‌సీఓ శ్రీనివా స్‌గౌడ్, డీసీఓ శ్రీవేణిలతో కలిసి అదనపు కలెక్టర్ యాదయ్య జ్యోతిప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించగా.. ఉమ్మడి జిల్లాలోని 14 ఎంజేపీ బీసీ బాలుర గురుకుల పాఠశాలలు, 4 కళాశాలల నుంచి 450 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొ న్నారు. అండర్–14, 17, 19 విభాగాల్లో క్రీడాకారులకు పలు పోటీలు నిర్వహించినట్లు ఆర్‌సీఓ తెలిపారు. ఉమ్మడి జిల్లా బీసీ గురుకులాల విద్యార్థులు ఐదేళ్లుగా స్టేట్ మీట్‌లో పాల్గొని సత్తా చాటుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ గురువయ్యగౌ డ్, ప్రశాంతి, పాఠశాల చైర్మన్ రాజు పాల్గొన్నారు.
వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులు


