సిరసనగండ్ల ఆలయాన్ని తీర్చిదిద్దుతాం
చారకొండ: అపర భద్రాద్రిగా పేరొందిన సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటకశాఖ డీఈ పర్శవేదిగౌడ్ అన్నారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర పర్యాటకశాఖ రూ. 2కోట్లు మంజూరు చేస్తూ జీఓ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులను టూరిజంశాఖ ఏఈ నాగార్జున, ఆర్కిటెక్చర్లు రమణారావు, మహేశ్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోని సంతోషి భవనంలో 18 గదుల నిర్మాణం, కొండ దిగువన 12 దుకాణాలతో కాంప్లెక్స్ భవనం, కోనేరు పునరుద్ధరణకు నివేదికలు సమర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం సీతారామచంద్రస్వామిని వారు దర్శించుకొని ప్రత్యేక పూ జలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ డేరం రామశర్మ, ఈఓ ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్ శర్మ, మురళీధర్ శర్మ, నందు శర్మ, కోదండరామ శర్మ పాల్గొన్నారు.


