ప్రజావాణికి 51 ఫిర్యాదులు
నాగర్‌కర్నూల్: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి వివిధ సమస్యలపై దరఖాస్తుదారుల నుంచి 51 అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి వస్తుంటారని, ఈ విషయంలో అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు హర్షవర్ధన్, అశోక్, ఏఓ చంద్రశేఖర్, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 15..
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు గ్రీవెన్స్‌కు 15 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో 10 భూ తగాదా, 4 తగు న్యాయం గురించి, ఒకటి భార్యాభర్తల గొడవ ఫిర్యాదు వచ్చాయని చెప్పారు.
దరఖాస్తుల స్వీకరణ
కందనూలు: దివ్యాంగుల సాధికారత రాష్ట్ర పురస్కారాల కోసం వ్యక్తిగత, సంస్థాగత కేటగిరీల వారీగా దివ్యాంగుల కోసం సేవలందిస్తున్న అర్హులైన వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలు అందిస్తున్నామన్నారు. దరఖాస్తు ఫారాలను www.wdsc.telanga na.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచి పూర్తి చేసిన ఫారాలను నవంబర్ 20 వరకు మహిళాశిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.
వైభవంగా సీతారాముల మాస కల్యాణం
చారకొండ: పునర్వసు నక్షత్రం సందర్భంగా సోమవారం సిర్సనగండ్లలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో స్వామివారి మాస కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లను అలంకరించి, అచ్చకులు మంత్రోచ్ఛరణాల మధ్య మాస కల్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు.
జనరిక్ దుకాణాల్లోఆకస్మిక తనిఖీలు
పాలమూరు: జిల్లా ఔషధశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల మెడికల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఔషధశాఖ ఏడీ దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు రఫీ, విశ్వంత్‌రెడ్డి, వినయ్ వేర్వేరుగా జడ్చర్ల, నాగర్‌కర్నూల్, నారాయణపేటలో జనరిక్ మెడికల్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. 10 దుకాణాల్లో రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు, విక్రయాల స్టాక్ పరిశీలించారు. లైసెన్స్ నిబంధనల ప్రకారం దుకాణాల నిర్వహిస్తున్నారా? లేదా అనే విషయంపై ఆరా తీశారు. జనరిక్ మందులు జీవనధార, ప్రధానమంత్రి జన ఔషధి స్టోర్స్‌లతో పాటు రిటైల్ దుకాణాల్లో జనరిక్ మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. రోగులు ప్రిస్కిప్షన్ ఆధారంగా జనరిక్ మందులు అడిగి తీసుకోవచ్చునని ఏడీ దినేష్‌కుమార్ తెలిపారు. జనరిక్ మందుల నాణ్యత, ప్రభావం బ్రాండెడ్ మందులతో సమానంగా ఉంటుందన్నారు.
ప్రజావాణికి 51 ఫిర్యాదులు
ప్రజావాణికి 51 ఫిర్యాదులు


