వైభవంగా పల్లకీసేవ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా పల్లకీసేవ

Nov 9 2025 9:23 AM | Updated on Nov 9 2025 9:23 AM

వైభవం

వైభవంగా పల్లకీసేవ

బిజినేపల్లి: కార్తీక మాసం రెండో శనివారాన్ని పురస్కరించుకొని వట్టెం అలివేలుమంగ, గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామికి పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ అర్చక బృందం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. ప్రత్యేక అలంకార సేవల అనంతరం అర్చకులు స్వామివారి మాడవీధుల్లో పల్లకీసేవ చేపట్టారు. కార్తీక పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి, అన్నదానం చేశారు.

శనేశ్వరుడికి

ప్రత్యేక పూజలు

బిజినేపల్లి: మండలంలోని శనేశ్వరుడి ఆలయానికి శనిదోష నివారణ కోసం భక్తులు శనివారం తెల్లవారుజాము నుంచే చేరుకుని భక్తిశ్రద్ధలతో స్వామివారికి తిలతైలాభిషేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి భక్తుల చేత గోత్రనామార్చనలు, దోష నివారణ మంత్రోచ్ఛరణ చేయించారు. అనంతరం శివుడిని దర్శించుకున్న భక్తులకు ఆలయ కమిటీ తీర్థప్రసాదాలు అందజేసింది. ఆలయ చైర్మన్‌ గోపాల్‌రావు, కమిటీ సభ్యులు రాజేష్‌, ప్రభాకరచారి, పుల్లయ్య, వీరశేఖర్‌, అర్చకులు శాంతికుమార్‌, ఉమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతులను గాలికొదిలేసిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌

బిజినేపల్లి: అతివృష్టి కారణంగా పత్తి, మొక్కజొన్న, వరి తదితర పంటలను రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌ జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మత్తులో మునిగిపోయి.. రైతులను గాలికొదిలేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. శనివారం మండలంలోని వెల్గొండ గ్రామంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత వారం రోజులుగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సీపీఐ బృందం పర్యటించి పంట నష్టం తీవ్రతను ప్రభుత్వానికి వివరించామన్నారు. ఎకరాకు రూ.30 వేలు తక్షణ సాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండు చేశారు. అధికార, ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా రైతులను గాలికి వదిలేశారని, ఎన్నికలపై పెట్టిన దృష్టి రైతులపై కూడా ఉంచాలని హితవు పలికారు. అలాగే సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున వేడుకలు జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ అన్నారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యు లు చంద్రమౌళి, మండల కార్యదర్శి కృష్ణాజీ, నాయకులు భూపేష్‌బాబు, మధుగౌడు, గంగాధర్‌, శ్రీనివాస్‌, పురుషోత్తం పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో ప్రతిభ చాటాలి

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్రస్థాయి యోగా సన పోటీల్లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఉ మ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లోని ఎస్‌ఎంపీ స్కూల్‌లో శనివారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి సబ్‌, జూనియర్‌ యోగాసన పోటీలకు క్రీడాకారులు తరలివెళ్లారు.

వైభవంగా పల్లకీసేవ 
1
1/2

వైభవంగా పల్లకీసేవ

వైభవంగా పల్లకీసేవ 
2
2/2

వైభవంగా పల్లకీసేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement