విద్యుత్ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట
వెల్దండ: గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ వెంకటనర్సింహారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కాలనీల్లో ఆయన పర్యటించి.. విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరించి, నాణ్యమైన కరెంటు సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఎక్కడా లో ఓల్టేజీ సమస్య లేకుండా చూస్తామన్నారు. అనంతరం విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఏఓ పార్థసారధి, లైన్‌మన్లు లక్ష్మణ్‌నాయక్, లస్కర్, సింగల్‌విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్యగౌడ్, మదన్, భరత్, రవి, ముత్యాలు, లక్ష్మయ్య, శ్రీశైలం, సమీర్ పాల్గొన్నారు.


