సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
బిజినేపల్లి: సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. గురువారం మండలంలోని వెలగొండలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 60మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 47 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 4 కార్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు, గంజాయికి యువత దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి వినియోగించినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చోరీల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


