‘ఉపాధి’ పనులనుపర్యవేక్షించాలి
తిమ్మాజిపేట: ఉపాధి హామీ పథకం పనులను నిరంతరం పర్యవేక్షించాలని డీఆర్డీఓ చిన్న ఓబులేషు మండల అధికారులకు సూచించారు. గురువారం తిమ్మాజిపేటలోని ఉపాధిహామీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు 2024–25 సంవత్సరం ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల వివరాలను తెలుసుకున్నారు. అదే విధంగా ఉపాధిహామీ పనుల సామాజిక తనిఖీపై ఆరా తీశారు. డీఆర్డీఓ వెంట ఎంపీడీఓ లక్ష్మీదేవి, ఏపీఓ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
విద్యారంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
అచ్చంపేట రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఆరోపించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ముందుగా కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, శివ, తరుణ్, విజయ్ పాల్గొన్నారు.
పశువులకు
టీకాలు తప్పనిసరి
తిమ్మాజిపేట: పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి జ్ఞానశేఖర్ సూచించారు. గురువారం మండలంలోని గుమ్మకొండ, పుల్లగిరి గ్రామాల్లో ఏర్పాటుచేసిన పశువైద్య శిబిరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పశువుల పెంపకందారులకు పలు సూచనలు చేశారు. పశువులకు సీజనల్‌గా ప్రబలే గాలికుంటు వ్యాధి నివారణ కోసం పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. పశువుల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పశువైద్యులు ఉదయ్‌కుమార్‌రెడ్డి, శ్రావణి, జేవీఓ విజయ లలిత, వీఏ ఖాదర్, ఓఎస్‌లు శాంతయ్య, రవి పాల్గొన్నారు.
18న జిల్లాస్థాయి యువజనోత్సవాలు
కందనూలు: ఈ నెల 18న జిల్లాస్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ సీతారాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని యువతీ యువకులకు జానపద నృత్యం, పాటలు, కథా రచన, పేయింటింగ్, వ్రకృత్వ, కవిత్వం, ఇన్నోవేషన్ ట్రాక్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని సాయి గార్డెన్‌లో పోటీలు ఉంటాయని.. యువజనోత్సవాల్లో పాల్గొనే వారు 15 నుంచి 29 ఏళ్ల వయసు కలిగి ఉండాలని సూచించారు. పూర్తి వివరాలకు 90591 74909, 83416 61832 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
‘ఉపాధి’ పనులనుపర్యవేక్షించాలి
‘ఉపాధి’ పనులనుపర్యవేక్షించాలి


