అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి
వంగూరు: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని డీఈఓ రమేశ్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని కొండారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీ లు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు తరగతి గదుల్లో విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సా మర్థ్యాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయు లు సమయపాలన పాటిస్తూ.. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలని సూచించారు.
మామిడి రైతులు
జాగ్రత్తలు పాటించాలి
కొల్లాపూర్: మామిడి పూతలు నిలిచేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉద్యానశాఖ అధికారి లక్ష్మణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలలోనే మామిడి పూత వస్తుందని.. ఈ సమయంలో తేనెమంచు పురుగు, పిండినల్లి, పొలుసు పురుగు తోటల్లో ఎక్కువగా కనిపిస్తుందన్నారు. వీటి నివారణకు ఒక లీటర్ నీటిలో ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ., వేపనూనె 2.5 మి.లీ., కార్బండిజమ్ 1 గ్రాము చొప్పున కలిపి చెట్లకు పిచికారీ చేయాలని సూ చించారు. పిండినల్లి పురుగులు చెట్టుపైకి పాక కుండా.. పాదులు చేసిన చెట్టు మొదలు చుట్టూ పాలిథిన్ పేపర్‌ను ఒక అడుగు వరకు చుట్టి జి గురు పూయాలన్నారు. సస్యరక్షణ చర్యలు చేపడితే పూతలు నిలుస్తాయని ఆయన తెలిపారు.


