వ్యాక్సిన్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో వ్యాధినిరోధక టీకాల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో వ్యాక్సిన్ స్టోర్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ నిల్వలు, శీతల గొలుసు నిర్వహణ, స్టాక్ రిజిస్టర్లు, ఇండెంట్లను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు సమయానుసారం వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా కొనసాగాలని సిబ్బందికి సూచించారు. వ్యాక్సిన్ భద్రత, నిల్వ విధానం, సరైన ఉష్ణోగ్రత నిర్వహణపై అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్నారులు, గర్భిణుల వ్యాక్సినేషన్ శాతాన్ని పెంపొందించేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్ టీం పీటర్, డేవిడ్, బద్రి, శ్రీనాథ్, డీపీఓ రేణయ్య, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, దివ్య, సాయి పాల్గొన్నారు.


