శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌సెర్చ్
అచ్చంపేట రూరల్: శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత కోసమే కార్డెన్‌సెర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ పల్లె శ్రీనివాసులు అన్నారు. బుధవారం పట్టణంలోని శివసాయినగర్‌కాలనీలో కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించామని, 58 వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు కనీస జాగ్రత్తలు పాటించాలన్నారు. సైబర్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణ అందరి బాధ్యతని తెలిపారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. రహదారి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో సీఐ నాగరాజు, ఎస్‌ఐలు సద్దాం హుస్సేన్, వెంకట్‌రెడ్డి ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌సెర్చ్


