
వాహనాల కొరతతో ఇబ్బందులు
అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో ఆటోల కొరతతో చెత్త సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు నాలుగు ఆటోలు మరమ్మతుల్లో ఉండగా.. ప్రస్తుతం రెండు ఆటోలు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో ఆరు ఆటోలు, 3 ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరిస్తున్నాం. తరుచుగా వాహనాలు మరమ్మతుకు గురవుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త ఆటోల కొనుగోలుకు కౌన్సిల్ తీర్మానం చేసింది. కొత్త ఆటోలు వస్తే ఇబ్బందులు తీరుతాయి.
– గణేష్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్, అచ్చంపేట
కొన్ని రోజులుగా చెత్తబండి నాలుగైదు రోజులకు ఒకసారి వస్తోంది. గతంలో రోజువారీగా చెత్త తీసుకెళ్లే వారు. చెత్త వాహనం రాకపోవడంతో ఇళ్లలో చెత్త పేరుకుపోతుంది. నాలుగైదు రోజులకు ఎందుకు వస్తున్నారంటే మాకు తెలియదు.. వాహనాలు లేవనే సమాధానం చెబుతున్నారు. రోజు చెత్తబండి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– జి.వరలక్ష్మి, సాయినగర్ కాలనీ, అచ్చంపేట
●