పట్టాలెక్కిన ఆనందం | - | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కిన ఆనందం

Oct 17 2025 8:20 AM | Updated on Oct 17 2025 8:20 AM

పట్టా

పట్టాలెక్కిన ఆనందం

యూనివర్సిటీ

మరింత అభివృద్ధి

పూర్తిస్థాయిలో వసతులు..

విలువలు పెంపొందించుకోవాలి

పీయూలో కనులపండువగా స్నాతకోత్సవం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవ కార్యక్రమం గురువారం కనులపండువగా జరిగింది. ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాగా.. పీయూ లైబ్రరీ ఆడిటోరియం వద్ద గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆడిటోరియం హాల్‌లో ఈసీ మెంబర్స్‌ సమావేశంలో పాల్గొని.. స్నాతకోత్సవం జరిగే లైబ్రరీ ఆడిటోరియంలోకి వచ్చారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన మన్నె సత్యనారాయణరెడ్డికి వీసీ శ్రీనివాస్‌ యూనివర్సిటీ చాన్స్‌లర్‌, గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతితో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ఆ తర్వాత గోల్డ్‌మెడల్స్‌ స్వీకరిస్తున్న విద్యార్థులు, పీహెచ్‌డీ అవార్డులు అందుకోనున్న విద్యార్థులతో ప్రమాణం చేయించారు. ముందుగా పీహెచ్‌డీ పూర్తిచేసిన 12 మందికి అవార్డులు, డాక్టరేట్‌, తర్వాత యూజీ, పీజీలో టాపర్లుగా నిలిచిన వారికి గోల్డ్‌మెడల్స్‌ అందించారు.

వీసీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీ ఒక సాధారణ పీజీ కళాశాలగా ప్రారంభమై 2008లో పూర్తిస్థాయిలో యూనివర్సిటీగా అవతరించి ప్రతి సంవత్సరం మరింత అభివృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నారు. 171 ఎకరాల్లో ఉన్న యూనివర్సిటీలో మహబూబ్‌నగర్‌లోని యూనివర్సిటీలో 5 కళాశాలలు ఉండగా గద్వాల, కొల్లాపూర్‌, వనపర్తిలో పీజీ సెంటర్లు కొనసాగుతున్నాయన్నారు. ప్రారంభంలో కేవలం 5 కోర్సులతో ప్రారంభమైన యూనిర్సిటీ ఇప్పుడు 24 కోర్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. కొత్తగా ఇంజినీరింగ్‌, లా కళాశాలలు ప్రారంభించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎఫ్‌సెట్‌ ద్వారా లా లో మొత్తం 100 శాతం (ఎల్‌ఎల్‌బీలో 60, ఎల్‌ఎల్‌ఎంలో 20) సీట్లు భర్తీ చేశామన్నారు. రీసెర్చ్‌లో 9 సబ్జెక్టులు ఉండగా.. 12 మందికి డాక్టరేట్‌ పట్టాలు అందిస్తున్నామని, మరో 25 మంది రీసెర్చ్‌లో ఉన్నారన్నారు. యూజీ, పీజీ స్థాయిలో సీబీసీఎస్‌ (చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం) అమలు పరుస్తున్నామని, ఇప్పటి వరకు 50 సెమినార్లు, 7 రోజులు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మూక్స్‌, స్వయం పోర్టల్స్‌లో ఇప్పటికే 2 వేలకుపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు.

పీయూలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తున్నామని, హాస్టళ్లు, లైబ్రరీ, స్పోర్ట్స్‌, ల్యాబ్స్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయని వీసీ అన్నారు. నూతనంగా రూ.13.2 కోట్లతో రీసెర్చి ఫెసిలిటీ భవనం నిర్మాణం జరుగుతుందని, రూ.35 కోట్లతో ఇంజినీరింగ్‌ కళాశాల, రూ.15 కోట్లతో లా కళాశాల నిర్మాణానికి అనుమతులు వచ్చాయన్నారు. ఇటీవల కొత్త బాలికల హాస్టల్‌ ప్రారంభించామని, ఇందులో 300 మంది విద్యార్థులకు వసతులు కల్పిస్తున్నామన్నారు. రూ.5 కోట్లతో సీవేజ్‌ వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నామన్నారు. పీఎం ఉషా స్కీం ద్వారా రూ.100 కోట్ల నిధులు వచ్చాయని, ఎన్‌ఈపీలో భాగంగా సమర్థ్‌ పోర్టల్‌ను ఉపయోస్తూ అడ్మినిస్ట్రేషన్‌ పరమైన మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. పీయూలో 70 శాతం ఈకో ఫ్రెండ్లీ వాతావరణం, గ్రీనరీ ఉండటం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.

మన్నె సత్యనారాయణరెడ్డికి

గౌరవ డాక్టరేట్‌ ప్రదానం

మరో 83 మందికి గోల్డ్‌మెడల్స్‌,

12 మందికి పీహెచ్‌డీల బహూకరణ

పీయూ మరింత అభివృద్ధి చెంది,

నాణ్యమైన విద్య అందించాలి:

గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

ఆడిటోరియం నిర్మాణానికి రూ.12

కోట్లు ప్రకటించిన ఎంఎస్‌ఎన్‌ రెడ్డి

పట్టాలెక్కిన ఆనందం 1
1/1

పట్టాలెక్కిన ఆనందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement