
వెలుగుల దీపావళి
టపాసుల
అమ్మకాల జోరు..
జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో టపాసుల దుకాణాలు ఏర్పాటుచేశారు. దాదాపు 12 దుకాణాలను ఏర్పాటుచేయగా.. కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. కొనుగోలుదారులతో దుకాణాలన్నీ సందడిగా మారాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ టపాసులు కాల్చేందుకు సిద్ధమయ్యారు.
కందనూలు: ఇంటిల్లిపాదిని ఆనందోత్సహాల్లో నింపే దీపావళి సందడి ప్రారంభమైంది. చెడుపై గెలిచిన మంచికి ప్రతీకగా జరుపుకొనే దీపావళి పర్వదినాన్ని సోమ, మంగళవారం వైభవంగా నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. వరుస సెలవుల రాకతో దూర ప్రాంతాల్లో ఉన్న వారు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. యువత, చిన్నారులు టపాసులు కాల్చడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది తిథులు, నక్షత్రాల ఆధారంగా ఆదివారం నరక చతుర్ధశి, సోమవారం మధ్యాహ్నం 1:30 తర్వాత అమావాస్య రావడంతో.. 2 గంటల నుంచి మంగళవారం సాయంత్రం వరకు కేధారేశ్వర నోములు నోముకోవచ్చని పండితులు వెల్లడించారు.
సందడిగా మార్కెట్లు..
దీపావళి పండుగ సందర్భంగా అన్ని మార్కెట్లు సందడిగా కనిపిస్తున్నాయి. పండుగ ఎంత ప్రసిద్దో.. ప్రమిదలు కూడా అంతే ప్రసిద్ది. మార్కెట్లోకి వివిధ ఆకారాల్లో ప్రమిదలు అమ్మకానికి వచ్చాయి. అదే విధంగా కొనుగోలుదారులతో వస్త్ర దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. బంతిపూలు, లక్ష్మీదేవి చిత్రపటాలు, గౌరీనోముల దండలు, చాటల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీపావళి సందర్బంగా స్మార్ట్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు, ఇతర గృహావసరాల వస్తువులు వివిధ ఆఫర్లతో అమ్మకాలు ఊపందుకున్నాయి.
పెరిగిన ధరలు..
దీపావళి సందర్భంగా వస్త్రాలు, టపాసులు, బంతిపూలు, కిరాణ సామగ్రి, ఇతర వస్తువుల ధరలను అమాంతం పెంచేశారు. ఏ వస్తువు కొనాలన్నా ధరలు అందుబాటులో లేవని వినియోగదారులు వాపోతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ధరలు ఇష్టారాజ్యంగా పెంచి విక్రయిస్తున్నారు. పూజ కోసం ఉపయోగించే బంతిపూలు సాధారణ రోజుల్లో రూ. 60 ధర ఉండగా.. ప్రస్తుతం రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. వివిధ రకాల డిజైన్‌లతో లభించే ప్రమిదలు రూ.5 నుంచి రూ.25 వరకు అమ్ముతున్నారు. పండుగ రోజుల్లో ధరల పెరుగుదలతో కొనుగోలుదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు.
చెడుపై గెలిచిన మంచికి ప్రతీకగా సంబరాలు
నేడు దివ్యకాంతుల పండుగ
జిల్లాలో మొదలైన సందడి
ప్రమిదలు, టపాసులు, వస్త్ర దుకాణాలు కిటకిట

వెలుగుల దీపావళి

వెలుగుల దీపావళి

వెలుగుల దీపావళి

వెలుగుల దీపావళి